గ్రామస్థాయి నుంచి కాంగ్రె్‌సను పటిష్టం చేస్తాం!

ABN , First Publish Date - 2022-12-07T00:01:22+05:30 IST

గ్రామ స్థాయి నుంచీ కాంగ్రెస్‌ పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేస్తామని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాకే్‌షరెడ్డి స్పష్టం చేశారు. నగరి నియోజకవర్గ పార్టీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న ఆయన వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యాక మంగళవారం తొలిసారి జిల్లాకు వచ్చారు.

గ్రామస్థాయి నుంచి కాంగ్రె్‌సను పటిష్టం చేస్తాం!

పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాకే్‌షరెడ్డి

నగరి/తిరుపతి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): గ్రామ స్థాయి నుంచీ కాంగ్రెస్‌ పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేస్తామని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాకే్‌షరెడ్డి స్పష్టం చేశారు. నగరి నియోజకవర్గ పార్టీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న ఆయన వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యాక మంగళవారం తొలిసారి జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు తిరుపతి విమానాశ్రయంలో పార్టీ శ్రేణుల నుంచీ ఘన స్వాగతం లభించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్ళి పూలమాలలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన వడమాలపేట, పుత్తూరు మీదుగా నగరికి చేరుకున్నారు.అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించాక రాకేష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.ప్రత్యేక హోదా రావాలన్నా , పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నా,విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆపాలన్నా కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలన్నారు.కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే నియమితులయ్యాక పార్టీ పటిష్టత కోసం 50 సంవత్సరాల లోపున్న వారికి పార్టీ పగ్గాలను అప్పగించారన్నారు. పీసీసీ కార్యదర్శులు రాంభూపాల్‌రెడ్డి, బుల్లెట్‌రవి,ఏఐసీసీ సభ్యుడు భానుమూర్తి, ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దెల అమృతతేజ, రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు సంత్‌కుమార్‌, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా కార్యదర్శి రెడ్డి కిషోర్‌, పరదేశి, ఇనయతుల్లా,నాగేశ్వరరావు, సుప్రజ,ఢిల్లీ, దేశయ్య, నటరాజ మొదలి, ఆర్‌.బాబు, చిరంజీవిరెడ్డి, లోహిత్‌రాజు, సిరోజ్‌ఖాన్‌, గోపాల్‌, కార్తీక్‌, దివాకర్‌, వెంకటేష్‌, హరీష్‌బాబు, చిన్ని, మణి, సుమన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:01:25+05:30 IST