విశ్వబ్రాహ్మణులు అన్ని రంగాల్లో రాణించాలి

ABN , First Publish Date - 2022-09-26T06:21:27+05:30 IST

విశ్వబ్రాహ్మణులు కులవృత్తికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అఖిల భారత విశ్వ బ్రాహ్మణ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ పేర్కొన్నారు.

విశ్వబ్రాహ్మణులు అన్ని రంగాల్లో రాణించాలి
సమావేశంలో మాట్లాడుతున్న రాజశేకర్‌

- అఖిల భారత విశ్వబ్రాహ్మణ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌

శ్రీరంగరాజపురం, సెప్టెంబర్‌ 25: విశ్వబ్రాహ్మణులు కులవృత్తికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అఖిల భారత విశ్వ బ్రాహ్మణ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ పేర్కొన్నారు. ఆదివారం పుల్లూరు క్రాస్‌లో అఖిల భారత విశ్వకర్మ మహాసభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులు ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. రాజకీయంగా గుర్తింపు రావాలంటే ఒకే తాటిపై నడవలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళ విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వెంకటనాగలక్ష్మి,  యువజన అధ్యక్షుడు చంద్రశేఖర్‌, జిల్లా యువజన అధ్యక్షుడు సుధాకర్‌ ఆచారి, యూత్‌ ప్రెసిడెంట్‌ చంద్రశేఖ ర్‌, కుప్పచారి, సురేష్‌ ఆచారి, రాము ఆచారి, దాము ఆచారి, సురేష్‌, లక్ష్మయ్య ఆచారి పాల్గొన్నారు.


Read more