నేడు, రేపు జిల్లాలో ప్రముఖుల పర్యటన

ABN , First Publish Date - 2022-10-03T05:46:03+05:30 IST

పలువురు ప్రముఖులు 3, 4వ తేదీలలో తిరుపతి జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి తెలిపారు.

నేడు, రేపు జిల్లాలో ప్రముఖుల పర్యటన

తిరుపతి(తిలక్‌రోడ్‌), అక్టోబరు 2: పలువురు ప్రముఖులు 3, 4వ తేదీలలో తిరుపతి జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ 3వ తేదీ ఉదయం 11గంటలకు రేణిగుంటకు చేరుకుని అక్కడి నుంచి 12.30గంటలకు రోడ్డు మార్గాన తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 3.10గంటలకు తిరుగుప్రయాణం  కానున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి గిరిజ శంకర్‌ ఆదివారం రాత్రి రామచంద్రాపురం మండలం సిద్ధేశ్వర మహర్షి ఆశ్రమానికి చేరుకుని రాత్రి బస చేయనున్నారు. 3, 4వ తేదీలలో తిరుమలలో పలు కార్యక్రమాలో పాల్గొననున్నారు. 5వ తేదీ తిరుగు ప్రయాణం కానున్నారు. ఇక తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి  4వ తేదీ శ్రీహరి కోట షార్‌లో వరల్డ్‌ స్పేస్‌ వీక్‌-2022 కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పలు కార్యాక్రమాల్లో పాల్గొననున్నారు. 

Read more