డీఈవోగా విజయేంద్రరావు బాధ్యతల స్వీకరణ
ABN , First Publish Date - 2022-11-05T00:45:40+05:30 IST
జిల్లా విద్యాశాఖ అధికారిగా విజయేంద్రరావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. డీఈవో కార్యాలయంలో ఏడీగా పనిచేస్తున్న ఈయనను రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ గత నెల 14న చిత్తూరు జిల్లా డీఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
చిత్తూరు (సెంట్రల్), నవంబరు 4: జిల్లా విద్యాశాఖ అధికారిగా విజయేంద్రరావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. డీఈవో కార్యాలయంలో ఏడీగా పనిచేస్తున్న ఈయనను రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ గత నెల 14న చిత్తూరు జిల్లా డీఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనేక పరిణామాల తర్వాత రెండు రోజుల క్రితం డీఈవో పురుషోత్తం బాధ్యతలు అప్పగించి రాష్ట్ర అకడమిక్ మానిటరింగ్ అధికారిగా విజయవాడకు వెళ్లారు. బాధ్యతలు చేపట్టిన విజయేంద్రరావుకు విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది, ఉపాధ్యాయ సంఘాల నేతలు శుభాకాంక్షలు తెలిపారు.