శాస్త్రోక్తంగా ఊంజల్‌సేవ
ABN , First Publish Date - 2022-01-18T06:01:48+05:30 IST
పౌర్ణమి పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరస్వామికి శాస్త్రోక్తంగా ఊంజల్‌సేవ నిర్వహించారు.
శ్రీకాళహస్తి, జనవరి 17: పౌర్ణమి పురస్కరించుకుని జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామికి సోమవారం శాస్త్రోక్తంగా ఊంజల్‌సేవ నిర్వహించారు. తొలుత ఆలయ అలంకార మండపంలో స్వామి, అమ్మవార్లను కొలువుదీర్చి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి ఊంజల్‌సేవను జరిపించారు. కొవిడ్ ఉధ్రుతి దృష్ట్యా ఈ వేడుకలను ఆలయ అధికారులు ఏకాంతంగానే నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.