ఆగిన మోడల్‌ స్కూల్‌ భవన నిర్మాణం

ABN , First Publish Date - 2022-05-18T06:21:38+05:30 IST

రొంపిచెర్ల, మే 17: మండలంలో మోడల్‌ స్కూల్‌ భవన నిర్మాణ పనులు నిధుల కొతరతో అర్ధంత రంగా ఆగిపోయాయి.

ఆగిన మోడల్‌ స్కూల్‌ భవన నిర్మాణం
రొంపిచెర్లలో ముందుకుసాగని మోడల్‌ పాఠశాల నిర్మాణ పనులు

రొంపిచెర్ల, మే 17: మండలంలో మోడల్‌ స్కూల్‌ భవన నిర్మాణ పనులు నిధుల కొతరతో అర్ధంత రంగా ఆగిపోయాయి. మండల విద్యార్థులకు ఉన్నత విద్యతో పాటు కళాశాల చదువులు కల్పించేందుకు 2018లో అప్పటి ప్రభుత్వం ఆదర్శ పాఠశాలను మం జూరు చేసింది. రొంపిచెర్ల పట్టణానికి సమీపంలోని మూరేవాండ్లపల్లె మార్గంలో భవన నిర్మాణానికి అ ప్పటి ఎమ్మెలే పెద్దిరెడ్డి శిలాఫలకం ఆవిష్కరిం చా రు. అయితే పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఈ క్రమంలో ఎంపీపీ చల్లా ప్రేమలత హయాంలో రొంపిచెర్ల మార్కెట్‌యార్డు సమీపంలో మోడల్‌ స్కూల్‌ కోసం 2.5 ఎకరాల స్థలం ఎంపిక చేశారు. అక్కడ పాఠశాలను నిర్మించ తలపెట్టారు. అయితే 2019 ప్రభుత్వం మారి పోవ డంతో తిరుపతి- మదనపల్లె రోడ్డులోని సబ్‌స్టేషన్‌ సమీపంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో మోడల్‌ స్కూల్‌ నిర్మాణానికి స్థలం కేటాయించారు. అంతేకాకుండా రూ.5.80 కోట్లు మంజూరు చేయించారు. ఇక్కడ 6వ తరగతి నుంచి ఇంటర్‌మీడియేట్‌ వరకు విద్యార్థుల కోసం 28 గదలు, హాస్టల్‌ భవన సముదాయ నిర్మా ణ పనులు ప్రారంభించారు. అయితే సకాలంలో బిల్లులు మంజూరు కాకపోడంతో నిర్మాణ పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. ప్రస్తుతం టెన్త్‌ వరకు బొమ్మయ్యగారిపల్లె ఉన్నత పాఠశాలకు చెందిన గదుల్లో విద్యా బోధనలు అందిస్తున్నట్టు మోడల్‌ స్కూల్‌ప్రిన్సి పాల్‌ సరళ చెప్పారు. మండలంలో 6నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 300 మంది విద్యార్థులు ఇంటర్‌ విద్య కోసం పీలేరు, మదనపల్లె, తిరుపతికి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకొని భవన నిర్మాణ పనులు వేగం పూర్తి చేయించాలని  విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Read more