టీచర్లకు యాప్‌ల భారం తప్పించండి
ABN , First Publish Date - 2022-08-19T07:09:41+05:30 IST
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు యాప్‌ల భారాన్ని తప్పించాలని ఫ్యాప్టో జిల్లా నాయకులు పేర్కొన్నారు.

ఆన్లైన్ హాజరుకు ప్రభుత్వమే పరికరాలివ్వాలి
కలెక్టరేట్ వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన
తిరుపతి(విద్య), ఆగస్టు 18: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు యాప్‌ల భారాన్ని తప్పించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) జిల్లా నాయకులు పేర్కొన్నారు. ఈమేరకు కలెక్టరేట్ వద్ద జిల్లాకమిటీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీచర్ల, విద్యార్థులహాజరు, మిడేమీల్స్ వంటి పథకాల వివరాలు అప్లోడ్ చేసేందుకు ఇటీవల పాఠశాల విద్యాశాఖ ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్ యాప్‌ను టీచర్ల సొంతఫోన్లలో డౌన్లోడ్ చేయాలని ఇచ్చిన ఉత్తర్వులు అభ్యంతరకరమని చెప్పారు. ఈయా్‌పను డౌన్లోడ్ చేయడం వల్ల టీచర్ల వ్యక్తిగత సమాచారానికి భద్రతలేకుండా పోతుందని.. అందువల్ల ప్రభుత్వమే పరికరాలు, ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో ఇతర వివరాల అప్లోడింగ్ బాధ్యతల నుంచి తమను తప్పించాలని కోరారు. ఈవిషయమై జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట కూడా నిరసన తెలిపి, ఏడీ లక్ష్మీనారాయణకు వినతిపత్రం సమర్పించారు. హెచ్ఎంల సంఘ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.వెంకటరమణ, నాయకులు ముత్యాలరెడ్డి, మునికృష్ణనాయుడు, నిర్మల, మధు,మురళి, మురళీకృష్ణ, వెంకటముని, రామచంద్రయ్య, సురేష్, సురేంద్ర, రమే్‌షబాబు, కన్నయ్య, రుక్మాంగద, మోహన్, సురే్‌షబాబు, జగన్నాథం, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.