కాణిపాక ఆలయంలో త్వరలో ఉదయాస్తమాన సేవ

ABN , First Publish Date - 2022-05-27T07:40:04+05:30 IST

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో త్వరలో ఉదయాస్తమాన సేవ నిర్వహించనున్నారు.

కాణిపాక ఆలయంలో   త్వరలో ఉదయాస్తమాన సేవ

ఐరాల(కాణిపాకం), మే 26: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో త్వరలో ఉదయాస్తమాన సేవ నిర్వహించనున్నారు. ఈ సేవకు అనుమతి కోరుతూ ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు దేవదాయశాఖకు నివేదికలు పంపారు. ఈ సేవను నిర్వహించడానికి దేవదాయశాఖ శాఖ కమిషనర్‌ నుంచి ఉత్తర్వులు ఇచ్చారు. ఆలయంలో ఉదయాస్తమాన సేవను నిర్వహించదలచిన భక్తులు రూ.లక్ష చెల్లించి శాశ్వత పూజను(10 సంవత్సరాల పాటు) నిర్వహించుకోవచ్చు. ఈ సేవలో పాల్గొనే భక్తులు ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయంలో నిర్వహించే గోపూజ, సుప్రభాతసేవ, పాలాభిషేకం, పంచామృతాభిషేకం, గణపతి హోమం, కల్యాణోత్సవం,ఊంజల్‌ సేవ, ఏకాంత సేవలో పాల్గొన వచ్చు. ఈ పూజలలో పాల్గొనే భక్తులకు రెండు రోజుల పాటు ఏసీ గదిని ఇస్తారు. దీనిపై ఆలయ కమిటీ చైర్మన్‌ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆగస్టు 21న ఆలయంలో మహాకుంభాభిషేకం పూర్తయిన తర్వాత ఉదయాస్తమాన సేవను ప్రారంభిస్తామన్నారు. ఈ సేవను సంవత్సరంలో ఒక్క రోజు నిర్వహించుకోవచ్చన్నారు. 


Updated Date - 2022-05-27T07:40:04+05:30 IST