ఇద్దరు ఏఆర్ డీఎస్పీలు బాధ్యతల స్వీకరణ
ABN , First Publish Date - 2022-12-16T00:23:15+05:30 IST
ఇద్దరు ఏఆర్ డీఎస్పీలు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్మ్‌డ్ రిజర్వు(ఏఆర్) అధికారుల బదిలీలు చేపట్టిన విషయం విదితమే. అందులో భాగంలో చిత్తూరులో ఖాళీగా ఉన్న రెండో పోస్టుల్లో మురళి, కృష్ణమోహన్ బాధ్యతలు స్వీకరించారు.
చిత్తూరు, డిసెంబరు 15 : ఇద్దరు ఏఆర్ డీఎస్పీలు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్మ్‌డ్ రిజర్వు(ఏఆర్) అధికారుల బదిలీలు చేపట్టిన విషయం విదితమే. అందులో భాగంలో చిత్తూరులో ఖాళీగా ఉన్న రెండో పోస్టుల్లో మురళి, కృష్ణమోహన్ బాధ్యతలు స్వీకరించారు. చిత్తూరులో హోంగార్డు ఆర్‌ఐగా ఉన్న మురళి పదోన్నతిపై డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అన్నమయ్య జిల్లాలో ఏఆర్ డీఎస్పీగా ఉన్న కృష్ణమోహన్ బదిలీపై చిత్తూరుకు వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అధికారులను ఆ శాఖ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు.