రవాణా శాఖలో ఎంవీఐలు, ఏఎంవీఐల బదిలీలు

ABN , First Publish Date - 2022-07-18T06:27:01+05:30 IST

రవాణా శాఖలో ఎంవీఐలు, ఏఎంవీఐలను బదిలీ చేస్తూ ఆ శాఖ కమిషనర్‌ పి.రాజ బాబు ఉత్తర్వులు జారీ చేశారు.

రవాణా శాఖలో ఎంవీఐలు, ఏఎంవీఐల బదిలీలు

చిత్తూరు సిటీ, జూలై 17: రవాణా శాఖలో ఎంవీఐలు, ఏఎంవీఐలను బదిలీ చేస్తూ ఆ శాఖ కమిషనర్‌ పి.రాజ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఎంవీఐలలో పి.వాసుదేవరెడ్డి రేణిగుంట చెక్‌పోస్ట్‌ నుంచి చిత్తూరుకు, ఎస్‌.నాగరాజ నాయక్‌ చిత్తూరు నుంచి కర్నూలుకు, సీహెచ్‌వీ శివారెడ్డి చిత్తూరు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నుంచి నరహరిపేట చెక్‌పో్‌స్టకు, ఆర్‌వీ.మధుసూదన్‌ పుత్తూరు నుంచి చిత్తూరు ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు, టీఎన్‌ మురళి తిరుపతి నుంచి చిత్తూరు ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు, వి.శేఖర్‌రావు చిత్తూరు నుంచి బద్వేల్‌కు, జీఎ్‌సవీ రాజేశ్వరరావు రాయచోటి నుంచి చిత్తూరుకు, టీ.క్రాంతికుమార్‌ చిత్తూరు నుంచి డోన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు, టీ.విజయకుమారి పెనుకొండ నుంచి చిత్తూరుకు బదిలీ అయ్యారు. ఏఎంవీఐలలో పి.చంద్రశేఖర్‌ తిరుపతి నుంచి నరహరిపేట చెక్‌పో్‌స్టకు, రఘునాథ్‌ నరహరిపేట చెక్‌పోస్ట్‌ నుంచి అనంతపురానికి, ఎన్‌ఆర్‌ హేమకుమార్‌ చిత్తూరు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నుంచి రేణిగుంట చెక్‌పో్‌స్టకు, ఆర్‌.సుప్రియ మదనపల్లె నుంచి చిత్తూరుకు, వై.శ్వేతబిందు చిత్తూరు నుంచి రేణిగుంట చెక్‌పో్‌స్టకు, ఎం.ప్రసాద్‌ వర్మ చిత్తూరు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నుంచి నరహరిపేట చెక్‌పో్‌స్టకు, ఎ.భాగ్యశ్రీ కర్నూలు నుంచి నరహరిపేట చెక్‌పో్‌స్టకు, వై.శివకుమార్‌ నరహరిపేట చెక్‌పోస్ట్‌ నుంచి చిత్తూరు ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు బదిలీ అయ్యారు.

Read more