డిప్యూటీ కలెక్టర్‌ సత్యవతి తిరుపతికి బదిలీ

ABN , First Publish Date - 2022-04-18T06:27:15+05:30 IST

కలెక్టరేట్‌లో ల్యాండ్‌ ప్రొటెక్షన్‌ సెల్‌లో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న సత్యవతిని ప్రభుత్వం రెవెన్యూశాఖనుంచి తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో దేవదాయశాఖకు బదిలీ చేసింది.

డిప్యూటీ కలెక్టర్‌  సత్యవతి తిరుపతికి బదిలీ
సత్యవతి

చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌17: కలెక్టరేట్‌లో ల్యాండ్‌ ప్రొటెక్షన్‌ సెల్‌లో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న సత్యవతిని ప్రభుత్వం రెవెన్యూశాఖనుంచి తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో దేవదాయశాఖకు బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.  ఆమె దేవదాయశాఖకు చెందిన  మఠం, దేవాలయాల భూముల పర్యవేక్షణ చేస్తారు.  రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా  తిరుపతిలో ఎక్కువ ప్రభుత్వ భూములు ఉన్న కారణంగా వాటి సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా తిరుపతి పేరిట ల్యాండ్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ను చిత్తూరు కలెక్టరేట్‌లో  ఏర్పాటు చేసింది. ఈ సెల్‌కు సంరక్షకురాలిగా సత్యవతి 2017 నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ల్యాండ్‌ రికార్డు ఏవోగా పనిచేస్తూ 2017లో ఆమె స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందారు. తెలుగు గంగ యూనిట్‌ వన్‌లో పనిచేశారు. తన విధి నిర్వహణలో ఎస్టేట్‌ అబాలిషన్‌ కేసులు, ఇనాం అప్పీళ్ళు, ల్యాండ్‌ రిపార్మ్‌ కేసులు, భూదాన్‌, అటవీ భూములు, చుక్కల భూములు, 22ఏ భూముల కేసుల పర్యవేక్షణ చేశారు. శనివారం  డిప్యూటీ కలెక్టర్‌ సత్యవతి తిరుపతికి బదిలీ అయ్యారు. కాగా ఆమె స్థానంలో చిత్తూరులో ఎవరినీ ఇంకా నియమించలేదు.

Updated Date - 2022-04-18T06:27:15+05:30 IST