తిరుపతి విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏఎస్పీకి ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌

ABN , First Publish Date - 2022-08-15T08:19:57+05:30 IST

తిరుపతి విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అదనపు ఎస్పీ ఈశ్వర్‌రెడ్డిని ప్రతిష్టాత్మక అవార్డు ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ (ఐపీఎం) వరించింది.

తిరుపతి విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏఎస్పీకి ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌
ఏఎస్పీ ఈశ్వర్‌రెడ్డి

తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 14: తిరుపతి విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అదనపు ఎస్పీ ఈశ్వర్‌రెడ్డిని ప్రతిష్టాత్మక అవార్డు ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ (ఐపీఎం) వరించింది. 33 ఏళ్లుగా పోలీసు శాఖలో అందించిన ఉత్తమ సేవలకుగాను కేంద్రప్రభుత్వం ఆయన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. సోమవారం విజయవాడలో జరగనున్న 76వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో సీఎం జగన్‌  నుంచి అవార్డు అందుకోనున్నారు. కాగా.. ఈయన ఇప్పటికే ఉత్తమ సేవా పతకం, ముఖ్యమంత్రి శౌర్య పతకం, నగదు రివార్డులు, జీఎ్‌సఈలు, ప్రశంసాపత్రాలతోపాటు ప్రతిష్టాత్మకమైన పోలీస్‌ గ్యాలంటరీ పతకాన్ని రాష్ట్రపతి చేతులమీదుగా అందుకుని ఉన్నారు. 


డీఎస్పీ నరసప్ప, సీఐ చంద్రశేఖర్‌కు మహోన్నత సేవా పతకాలు

తిరుపతి వెస్ట్‌ డీఎస్పీ నరసప్ప, డీసీఆర్బీ సీఐ చంద్రశేఖర్‌ మహోన్నత సేవా పతకాలకు, తిరుపతి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ ఎస్‌ఐ వీవీ సుబ్బానాయుడు, ఏఆర్‌ ఆర్‌ఐ రెడ్డెప్పరెడ్డి ఉత్తమ సేవాపతకాలకు ఎంపికయ్యారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం, నవంబర్‌-2021 సంవత్సరానికి సంబంధించి డీఎస్పీ నరసప్ప, ఎస్‌ఐ సుబ్బానాయుడు మహోన్నత, ఉత్తమ సేవ పతకాలకు ఎంపికయ్యారు. ఉగాది పురస్కారాలు-2022కుగాను సీఐ చంద్రశేఖర్‌, ఆర్‌ఐ రెడ్డెప్పరెడ్డి మహోన్నత, ఉత్తమ సేవ పతకాలకు ఎంపికయ్యారు. వీరు సోమవారం తిరుపతిలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవంలో కలెక్టర్‌ చేతులమీదుగా అవార్డులు అందుకోనున్నారు. వీరితోపాటు ఎస్‌బీ ఏఎ్‌సఐ ఏవీ శ్రీధరన్‌, ఏఆర్‌ఎ్‌సఐ వి.రాజశేఖర్‌రెడ్డి, తిరుమల టూటౌన్‌ ఏఎ్‌సఐ ఎం.వెంకటముని, ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ జీవీ రవికుమార్‌, కమాండ్‌ కంట్రోల్‌ కానిస్టేబుల్‌ బి.గంగరాజు 2021కిగాను సేవా పతకాలకు ఎంపికయ్యారు. ఈస్ట్‌ సీఐ శివప్రసాద్‌రెడ్డి, ఎంఆర్‌పల్లె ఏఎ్‌సఐ నజీర్‌, ఎస్వీయూ ఏఎ్‌సఐ దామోదరం, ఆర్‌ఎ్‌సఐ రామ్‌ప్రసాద్‌, పీసీఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ ఉమామహేశ్వరి, ఎస్‌డీపీవో కానిస్టేబుల్‌ కృష్ణయ్య సేవాపతకాలకు ఎంపికయ్యారు. మరో ముగ్గురు అంత్రిక్‌ సురక్షసేవ పతకాలకు, డీజీపీ కమెండేషన్‌ డిస్క్‌ అవార్డుకు 10 మంది, మరొకరు ఉత్కృష్టసేవ పతకాలకు ఎంపియ్యారు. వీరు కూడా కలెక్టర్‌ చేతులమీదుగా అవార్డులు అందుకోనున్నారు. 

Updated Date - 2022-08-15T08:19:57+05:30 IST