11 నుంచి తిరుపతి - కాట్పాడి జంక్షన్‌ ఎక్స్‌ప్రెస్‌

ABN , First Publish Date - 2022-07-05T05:52:30+05:30 IST

తిరుపతి - కాట్పాడి జంక్షన్‌ డైలీ అన్‌ రిజర్వ్‌డ్‌ ఎక్స్‌ప్రెస్‌ (07581/07582) ఈ నెల 11వ తేదీ నుంచి పునఃప్రారంభం కానుంది.

11 నుంచి తిరుపతి - కాట్పాడి జంక్షన్‌ ఎక్స్‌ప్రెస్‌

చెన్నై, జూలై 4 (ఆంధ్రజ్యోతి): తిరుపతి - కాట్పాడి జంక్షన్‌ డైలీ అన్‌ రిజర్వ్‌డ్‌ ఎక్స్‌ప్రెస్‌ (07581/07582) ఈ నెల 11వ తేదీ నుంచి పునఃప్రారంభం కానుంది. తిరుపతిలో ఉదయం 10.55 గంటలకు బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్‌ (07581) అదే రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు కాట్పాడి చేరుకుంటుంది. తిరిగి (07582) రాత్రి 9.55 గంటలకు కాట్పాడిలో బయలుదేరి అదే రోజు రాత్రి 11.50 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. మొత్తం 8 మెము బోగీలతో కూడిన ఈ రైళ్లు తిరుపతి వెస్ట్‌, చంద్రగిరి, కోటాల, పనబాక్కం, పాకాల జంక్షన్‌, పూతలపట్టు, చిత్తూరు, సిద్ధామపల్లె, పేయనపల్ల్లె, రామాపురం, బొమ్మసముద్రం స్టేషన్లలో ఆగి వెళ్తాయి.  


Read more