ముగ్గురు ‘ఎర్ర’ స్మగ్లర్ల అరెస్టు

ABN , First Publish Date - 2022-03-16T07:06:23+05:30 IST

వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఓ ప్రాంతం నుంచి రూ.70లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

ముగ్గురు ‘ఎర్ర’ స్మగ్లర్ల అరెస్టు
ఎర్రచందనం దుంగలను పరిశీలిస్తున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

రూ.70 లక్షల దుంగల స్వాధీనం


చంద్రగిరి, మార్చి 15: వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఓ ప్రాంతం నుంచి రూ.70లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తెలిపిన వివరాలిలా.. ఎస్పీ సుందరరావు ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీధర్‌ పర్యవేక్షణలో ఆర్‌ఐ సురే్‌షకుమార్‌ బృందంలోని ఆర్‌ఎ్‌సఐ లింగాధర్‌, మరికొంత మంది పోలీసులు శేషాచలం అడవుల్లో కూంబింగ్‌ చేపట్టారు. మంగళవారం తెల్లవారు జామున శేషాచలం అడవుల్లోని అన్నదమ్ములబండ వద్దకు పోలీసుల బృందం రాగానే కొంతమంది దుండగులు ఎర్రచందనం దుంగలను మోసుకొస్తూ తారసపడ్డారు. వారిని చుట్టుముట్టే లోగా ఎర్రచందనం దుంగలను పడేసి అడవుల్లోకి పరారయ్యారు. వెంబడించి ఓ స్మగ్లర్‌ని అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆ ప్రాంతం నుంచి 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్‌ అయిన స్మగ్లర్‌ తమిళనాడు రాష్ట్రం, తిరువణ్ణామలై జిల్లా జవ్వాదిమలైకు చెందిన రామకృష్ణగా గుర్తించారు. స్వాధీనం చేసుకున్న దుంగలు విలువ సుమారు రూ.70 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. పరారైన స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీఐ చంద్రశేఖర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే చంద్రగిరి మండలంలోని చామల రేంజ్‌ అటవీ ప్రాంతంలోకి చొరబడిన తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లాకు చెందిన రాజేంద్ర, పెరుమాళ్‌ అనే స్మగ్లర్లను అరెస్ట్‌ చేశారు. వారివద్ద నుంచి ఎర్రచందనం చెట్లు నరికేందుకు ఉపయోగించే గొడ్డలి, బ్యాగులు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఎస్‌ఐ మోహన్‌నాయక్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమావేశంలో డీఎస్పీ మురళీధర్‌, సీఐలు చంద్రశేఖర్‌, రామకృష్ణ, ఆర్‌ఐ సురే్‌షకుమార్‌రెడ్డి, ఎఫ్‌ఆర్వోలు ప్రసాద్‌, ప్రేమ, ఆర్‌ఎ్‌సఐ లింగాధర్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-16T07:06:23+05:30 IST