17 నుంచి శ్రీవారి ఆలయంలో తిరుప్పావై
ABN , First Publish Date - 2022-12-15T03:18:54+05:30 IST
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం ఈ నెల 16వ తేదీన ప్రారంభం కానుంది.
తిరుమల, డిసెంబరు14 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం ఈ నెల 16వ తేదీన ప్రారంభం కానుంది. ఆ రోజు సాయంత్రం 6.12 గంటలకు ధనుర్మాస ఘడియలు మొదలుకానున్న నేపథ్యంలో 17వ తేదీ నుంచి జనవరి 14 వరకు వేంకటేశ్వరస్వామికి వేకువజామున నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు.