అమరావతిపై హైకోర్టు తీర్పు హర్షణీయం
ABN , First Publish Date - 2022-03-07T06:10:28+05:30 IST
రాజధాని రైతులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు రావడం హర్షణీ యమని తెలుగురైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిగుంట మనోహర్ నాయుడు పేర్కొన్నారు.
శ్రీరంగరాజపురం, మార్చి 6: రాజధాని రైతులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు రావడం హర్షణీ యమని తెలుగురైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిగుంట మనోహర్ నాయుడు పేర్కొన్నారు. ఆదివారం ఎస్‌ఆర్‌పురం మండలం కటికపల్లెలో టీడీపీ నేత గోపి కుమారుడి ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించి, ఉచిత విద్యుత్ ఎత్తివేసి రైతులను మరింత అప్పుల్లోకి నెట్టబోతున్నారని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఉచిత విద్యుత్‌కు వైసీపీ ప్రభు త్వం త్వరలో మంగళం పాడబోతోందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు నాగేశ్వరరావు, గుండయ్య, బీగాల రమేష్, చెంగల్రాయ యాదవ్, రవి, మునిరాజు, కోదండరెడ్డి, కొత్తపల్లె రమేష్, త్యాగరాజ్ నాయుడు, ధన, బుక్కపట్నం, వినాయక తదితరులు పాల్గొన్నారు.