టీడీపీ నాయకుడిపై రౌడీ షీట్‌ను కొట్టేసిన హైకోర్టు

ABN , First Publish Date - 2022-08-02T05:01:42+05:30 IST

తనపై పోలీసులు పెట్టిన రౌడీ షీట్‌ కేసును అమరావతి హైకోర్టు కొట్టేసినట్లు చౌడేపల్లె టీడీపీ మండల అధ్యక్షుడు గువ్వల రమేష్‌రెడ్డి పేర్కొన్నారు.ఈక్రమంలో పోలీసులపై పరువునష్టం దావా వేయనున్నట్లు తెలిపారు.

టీడీపీ నాయకుడిపై రౌడీ షీట్‌ను కొట్టేసిన హైకోర్టు

పోలీసులపై పరువు నషం్ట దావా వేస్తా


చౌడేపల్లె మండల అధ్యక్షుడు రమేష్‌రెడ్డి 

చౌడేపల్లె, ఆగస్టు 1: తనపై పోలీసులు పెట్టిన రౌడీ షీట్‌ కేసును అమరావతి హైకోర్టు కొట్టేసినట్లు  చౌడేపల్లె టీడీపీ మండల అధ్యక్షుడు గువ్వల రమేష్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ... చౌడేపల్లె మండలంలోని ఎస్‌ఐ, సీఐలు తనపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు 2021 ఫిబ్రవరి 21న తనపై రౌడీ షీట్‌ తెరిచారన్నారు. తనపై అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టడం, తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురిచేయడంతోపాటు జైలుకు కూడా పంపారన్నారు. పోలీసులు... వైసీపీ నాయకులకు తొత్తులుగా మారి తనతో పాటు మండల టీడీపీ కార్యకర్తలపై ఎన్నో తప్పుడు కేసులు బనాయించారన్నారు.  తనపై రౌడీ షీట్‌ నమోదు చేయడంతో తాను హైకోర్టును ఆశ్రయించగా  తనకు రిట్‌ పిటిషన్‌ నెంబరు డబ్ల్యూపీ 12911/2021ని కేటాయించినట్లు తెలిపారు. తనపై పెట్టిన కేసు పూర్వపరాలు పరిశీలించిన న్యాయమూర్తి మానవేంద్రరాయ్‌  ధర్మాసనం రౌడీషీట్‌ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చిందన్నారు. ఈక్రమంలో పోలీసులపై పరువునష్టం దావా వేయనున్నట్లు రమేష్‌రెడ్డి తెలిపారు.  

Read more