తిరుపతి, చిత్తూరుల్లో టెన్త్‌ మూల్యాంకనం

ABN , First Publish Date - 2022-11-25T00:04:37+05:30 IST

ఈ విద్యా సంవత్సరంలో జరిగే టెన్త్‌ పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల మూల్యాకనం తిరుపతి, చిత్తూరుల్లో జరగనుంది. జిల్లాల పునర్విభజన జరిగినా.. గతేడాది ఉమ్మడి చిత్తూరు జిల్లాకు కలిపి టెన్త్‌ పరీక్షలు నిర్వహించారు. జవాబు పత్రాలను చిత్తూరులోనే దిద్దారు.

తిరుపతి,  చిత్తూరుల్లో టెన్త్‌ మూల్యాంకనం

చిత్తూరు (సెంట్రల్‌), నవంబరు 24: ఈ విద్యా సంవత్సరంలో జరిగే టెన్త్‌ పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల మూల్యాకనం తిరుపతి, చిత్తూరుల్లో జరగనుంది. జిల్లాల పునర్విభజన జరిగినా.. గతేడాది ఉమ్మడి చిత్తూరు జిల్లాకు కలిపి టెన్త్‌ పరీక్షలు నిర్వహించారు. జవాబు పత్రాలను చిత్తూరులోనే దిద్దారు. రాష్ట్ర విద్యాశాఖ తాజా ఉత్తర్వుల ప్రకారం ఈ విద్యా సంవత్సరంలో మాత్రం టెన్త్‌ జవాబు పత్రాల మూల్యాకనం ఆయా జిల్లాల్లో ఉంటుంది. ఆ ప్రకారం.. చిత్తూరు జిల్లాకు చిత్తూరులో.. కొత్తగా ఏర్పాటైన తిరుపతి జిల్లాకు తిరుపతిలో టెన్త్‌ జవాబు పత్రాల మూల్యాంకనం జరగనుంది. తిరుపతిలో ఏ ప్రదేశంలో మూల్యాంకనం చేయాలనే ప్రదేశాన్ని గుర్తించి రాష్ట్ర విద్యాశాఖకు ఆ జిల్లా విద్యాశాఖాధికారి నివేదిక పంపాల్సి ఉంది.

2 నుంచి ఫార్మేటివ్‌-2 పరీక్షలు

జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరం సవరించిన షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలను నిర్వహించనున్నట్లు డీఈవో విజయేంద్రరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తాజా షెడ్యూల్‌ ప్రకారం డిసెంబరు 2 నుంచి 6 వరకు ఫార్మేటివ్‌-2 పరీక్షలు, జనవరి 2 నుంచి 10 వరకు సమ్మెటివ్‌-1 పరీక్షలు, ఫిబ్రవరి 7 నుంచి 10 వరకు ఫార్మేటివ్‌-3 (సీబీఏ) పరీక్షలు, మార్చి 9 నుంచి 14 వకు ఫార్మేటివ్‌-4 పరీక్షలు, మార్చి 20 నుంచి 25 వరకు టెన్త్‌ ఫ్రీఫైనల్‌ పరీక్షలు, ఏప్రిల్‌ 20 నుంచి 27 వరకు సమ్మెటివ్‌-2 (సీబీఏ3) పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు.

Updated Date - 2022-11-25T00:04:37+05:30 IST

Read more