Amarnath Reddy: అధికార మదంతో అడ్డు అదుపు లేని అరాచకాలు
ABN , First Publish Date - 2022-12-17T15:36:07+05:30 IST
వైసీపీ నేతలు (YCP Leaders) అధికార మదంతో అడ్డు అదుపు లేని అరాచకాలు చేస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి అమర్నాథ రెడ్డి (Amarnath Reddy) మండిపడ్డారు.
చిత్తూరు జిల్లా: వైసీపీ నేతలు (YCP Leaders) అధికార మదంతో అడ్డు అదుపు లేని అరాచకాలు చేస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి (Amarnath Reddy) మండిపడ్డారు. మాచర్ల (Macherla) ఘటనపై స్పందించిన ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్రాన్ని.. సీఎం జగన్ (CM Jagan) అరాచకాలకు అడ్డగా మారుస్తున్నారని విమర్శించారు. టీడీపీ (TDP)కి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఓటమి భయంతోనే ప్రతిపక్షాలపై దౌర్జన్యాలు, దాడులు చేస్తున్నారని ఆరోపించారు. బీహార్‌ను బీట్ చేసేలా మొన్న పుంగనూరు.. నేడు మాచర్ల ఘటనలు ఉన్నాయన్నారు. ప్రజలు, ప్రతిపక్షం కన్నెర జేస్తే పాతాళానికి వెళ్లిపోతారన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసేలా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణమన్నారు. మాచర్ల అల్లరి మూకలను వెంటనే అరెస్టు చేయాలని అమర్నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు.