టీసీరాజన్‌ ః 104

ABN , First Publish Date - 2022-08-14T06:28:34+05:30 IST

స్వాతంత్య్ర సమరయోధుడు. సాత్వికాహారం, క్రమశిక్షణ కలిగిన జీవితంతో 104 ఏళ్ల ఆరోగ్యవంతుడు. మాజీ శాసనసభ్యుడు. సొంతిల్లు, ఎకరా పొలమూ లేని నిస్వార్థ నేత. ఆయనే టీసీ రాజన్‌.

టీసీరాజన్‌  ః 104
టీసీ రాజన్‌

పెద్దపంజాణి మండలం రాయలపేటలో అన్నయ్యగౌడు, సంపెంగమ్మ దంపతులకు 1918 సెప్టెంబరు 11న టీసీ రాజన్‌ జన్మించారు. 5వ తరగతి దాకా ప్రాథమిక పాఠశాలలో చదివారు.మదనపల్లె కోర్టు ఎదురుగా అనిబిసెంట్‌ స్థాపించిన థియోసాఫికల్‌ హైస్కూలు, కళాశాలలో ఎస్‌ఎ్‌సఎల్‌సీ,ఎ్‌ఫఏ, తర్వాత బీఏ రెండేళ్ల కోర్సు చేశారు. 1942లో కాంగ్రె్‌సవాదులతో టీసీ రాజన్‌కు సంబంధాలు ఏర్పడ్డాయి.స్వాతంత్య్ర పోరాటంలో తానూ భాగమయ్యారు. తంతితపాలా వైర్లను ధ్వంసం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. మూడు నెలల జైలు శిక్ష విధించి బళ్లారి జైలుకు తరలించారు.బయటికొచ్చిన తర్వాత కూడా ఉద్యమంలో  చురుగ్గా వ్యవహరించారు. 


స్వాతంత్య్రం వచ్చాక.. 


కాంగ్రెస్‌ పాలనతో విసిగి రాజగోపాల్‌ 1958లో స్వతంత్ర పార్టీని స్థాపించగా టీసీ రాజన్‌ను జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 1962లో జరిగిన చిత్తూరు లోక్‌సభ ఎన్నికల్లో ఆచార్య రంగా విజయానికి ఎంతో కృషి చేశారు.1967లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పలమనేరు నుంచి స్వతంత్రపార్టీ అభ్యర్థిగా టీసీ రాజన్‌ గెలుపొంది శాసనసభలో అడుగు పెట్టారు. భూమిశిస్తు పెంపు ప్రతిపాదనపై 45 నిమిషాలు నిరవధికంగా మాట్లాడి అందరి మన్ననలు పొందారు.ఇప్పటికీ సొంతిల్లు లేని రాజన్‌ భార్య భ్రమరాంబ  చనిపోయాక కుమారుల వద్ద ఉంటున్నారు. 


పలమనేరు రాబాదు, అహ్మదాబాద్‌ మీదుగా ఢిల్లీ దాకా రైల్లో వెళ్లారు. స్వాతంత్య్రం వచ్చే దాకా దేశమంతా తిరిగి స్వాతంత్య్రపోరాటానికి ప్రజలను సమాయత్తం చేశారు.చాలాసార్లు అరెస్టయ్యారు. నేతాజీ స్థాపించిన ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లో కూడా కొంతకాలం పనిచేశారు.1946లో బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ జిల్లాలో పర్యటించినప్పుడు బంగారుపాళ్యం, పుంగనూరు జమీందార్లు ఆయనతో సంభాషించేందుకు ఆంగ్లం రాకపోవడంతో శివశంకరయ్యే అనువాదకుడిగా వ్యవహరించారు. 


మేల్‌ నర్సు కోర్సు చేసినందున దేశానికి సేవ కొనసాగించే ఉద్దేశంతో శివశంకరయ్య ఆర్మీలో చేరారు. సిపాయి హోదాలో ఆర్మీ మెడికల్‌ కార్ప్స్‌లో నర్సింగ్‌ అసిస్టెంట్‌గా చేరి.. 1961 వరకూ పనిచేశారు.రిటైరయ్యాక పింఛను తీసుకోలేదు. స్వాతంత్ర సమరయోధుడిగా పింఛనూ వద్దన్నారు. 1963లోనే తిరుపతి అవిలాల గ్రామంలో 5 ఎకరాల వ్యవసాయ భూమిని ప్రభుత్వం మంజూరు చేస్తే వద్దని రాసిచ్చేశారు. ముగ్గురు కొడుకులున్నా వారిపై ఆధారపడకుండా సేద్యం చేసుకుంటూ, పశువులు మేపుకుంటూ శివశంకరయ్య బతుకుతున్నారు.

Updated Date - 2022-08-14T06:28:34+05:30 IST