జాతీయ రహదారి పనులను వేగవంతం చేయించండి

ABN , First Publish Date - 2022-12-15T00:11:53+05:30 IST

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న పలు జాతీయ రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయించాలని జిల్లా ఎంపీలు కోరారు. బుధవారం ఢిల్లీలోని పార్లమెంటు ఆవరణలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరిని ప్యానల్‌ స్పీకర్‌ పి.వి.మిథున్‌రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప కలిసి వినతిపత్రాన్ని, జ్ఞాపికను అందజేశారు.

జాతీయ రహదారి పనులను వేగవంతం చేయించండి
కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరిని కల్సిన ఉమ్మడి జిల్లా ఎంపీలు

కేంద్ర మంత్రికి జిల్లా ఎంపీల అభ్యర్థన

చిత్తూరు కలెక్టరేట్‌, డిసెంబరు 14: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న పలు జాతీయ రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయించాలని జిల్లా ఎంపీలు కోరారు. బుధవారం ఢిల్లీలోని పార్లమెంటు ఆవరణలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరిని ప్యానల్‌ స్పీకర్‌ పి.వి.మిథున్‌రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప కలిసి వినతిపత్రాన్ని, జ్ఞాపికను అందజేశారు. వారు మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న బెంగుళూరు ఎక్స్‌ప్రెస్‌ హైవే పనులు, చిత్తూరు-తచ్చూరు రోడ్డు, చిత్తూరు నుంచి ప్రారంభమయ్యే ఆరు వరుసల రహదారి పనులు, ములకలచెరువు నుంచి ప్రారంభమయ్యే తిరుపతి రోడ్డు పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని చెప్పారు. వేగవంతం చేసి అందుబాటులోకి తీసుకొస్తే జిల్లాకు రవాణా మరింత పెరుగుతుందని, మరెన్నో కొత్తపరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎంపీలు తెలిపారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ పనులు వేగవంతంగా చేసేందుకు ఆదేశాలిస్తామని హామీయిచ్చారు.

Updated Date - 2022-12-15T00:11:57+05:30 IST