స్వర్ణముఖి సోయగం
ABN , First Publish Date - 2022-11-04T01:02:36+05:30 IST
పవిత్ర స్వర్ణముఖి నదిలో జలకళ ప్రారంభం అయింది.
శ్రీకాళహస్తి, నవంబరు 3: పవిత్ర స్వర్ణముఖి నదిలో జలకళ ప్రారంభం అయింది. ఇటీవల వరకు స్వర్ణముఖి నది నీరు లేక వెలవెలబోయింది. ఉన్న కొద్దిపాటి నీరు ఓ మూలగా ఉండేది. అయితే మూడు రోజుల నుంచి ఎగువప్రాంతాల్లో కురిసిన వర్షాలతో నదిలో మెల్లమెల్లగా నీరు చేరుతోంది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మరో రెండు రోజులు వర్షాలు బాగా పడితే నదిలోకి మరంత నీరు చేరనుంది. స్వర్ణముఖి నది సోయగాన్ని ప్రజలు ఆస్వాదిస్తున్నారు.