ఎస్వీయూ దూరవిద్యకు నోటిఫికేషన్‌ విడుదల

ABN , First Publish Date - 2022-08-04T06:45:42+05:30 IST

ఎస్వీయూనివర్సిటీ దూరవిద్య విభాగం 2022-23 అకడమిక్‌ ఇయర్‌ నిర్వహించే పలు డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్‌ విడుదలైంది.

ఎస్వీయూ దూరవిద్యకు నోటిఫికేషన్‌ విడుదల

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), ఆగస్టు 3: ఎస్వీయూనివర్సిటీ దూరవిద్య విభాగం 2022-23 అకడమిక్‌ ఇయర్‌  నిర్వహించే పలు డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎంఏ (తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఎకనమిక్స్‌, సోషియల్‌ వర్క్‌, ఎంఎల్‌ఐఎ్‌ససీ), ఎమ్మెస్సీ (ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సైకాలజీ, మ్యాథమెటిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌), ఎంకాం, ఎంబీఏ కోర్సులు నిర్వహిస్తున్నారు. డిగ్రీలో బీఏ, బీఎస్సీ, బీకాంతోపాటు పీజీ డిప్లొమా (ఇండస్ట్రీయల్‌ రిలేషన్స్‌ అండ్‌ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌, గైడెన్స్‌ అండ్‌ కౌన్సెలింగ్‌) వంటి కోర్సులు ఉన్నాయి. ఇందులో ప్రవేశానికి బుధవారం నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

Updated Date - 2022-08-04T06:45:42+05:30 IST