ఎస్వీయూ డీడీఈ ఫలితాలు వెల్లడి
ABN , First Publish Date - 2022-07-31T06:45:28+05:30 IST
ఎస్వీయూలో దూరవిద్యలో పీజీ (ఎంఏ ఇంగ్లీషు) ఫలితాలను శనివారం విడుదల చేసినట్లు వర్సిటీ అధికారులు పేర్కొన్నారు.
తిరుపతి(విద్య), జూలై30: ఎస్వీయూలో దూరవిద్యలో పీజీ (ఎంఏ ఇంగ్లీషు) ఫలితాలను శనివారం విడుదల చేసినట్లు వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. ప్రీవియస్, ఫైనలియర్ ఫలితాలను విడుదల చేశామని, వివరాల కోసం వర్సిటీ వైబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.
లా విభాగంలో వెబినార్: ఎస్వీయూలో ఐదు సంవత్సరాల న్యాయశాస్త్ర విభాగంలో శనివారం ‘ఎవాల్వింగ్ జురిస్ ప్రుడెన్స్ ఆన్ క్యాపిటల్ పనిష్‌మెంట్’ అనే అంశంపై ఆన్‌లైన్‌లో వెబినార్ నిర్వహిం చారు. ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ సోనియా మతుర్ హాజరై చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రిన్సిపాల్ బీవీ మురళీధర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.