చంద్రబాబు పాలనలోనే రాష్ట్రాభివృద్ధి

ABN , First Publish Date - 2022-03-05T06:26:29+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు పాలనతోనే రాష్ట్రాభివృద్ది సాధ్యమని జీడీనెల్లూరు నియోజవర్గ టీడీపీ కోర్డినేటర్‌ చిట్టిబాబు అన్నారు.

చంద్రబాబు పాలనలోనే రాష్ట్రాభివృద్ధి
సమావేశంలో మాట్లాడుతున్న చిట్టిబాబు నాయుడు

శ్రీరంగరాజపురం, మార్చి 4: టీడీపీ అధినేత చంద్రబాబు పాలనతోనే రాష్ట్రాభివృద్ది  సాధ్యమని జీడీనెల్లూరు  నియోజవర్గ టీడీపీ కోర్డినేటర్‌ చిట్టిబాబు అన్నారు.  మండలంలోని ఎగువకమ్మకండ్రిగ, పుల్లూరు, పద్మాపురం పంచాయతీల్లో జరిగిన ఆత్మగౌరవ సభల్లో ఆయన మాట్లాడుతూ...  వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటీకి వెళ్లి వివరించాలన్నారు. యువతకు ఉద్యోగాల కల్పన తీరని కలగానే మిగిలిందన్నారు.  పార్టీ మండల అధ్యక్షుడు గంధమనేని జయశంకర్‌ నాయుడు ఆధ్వర్యంలో ఎగువకమ్మకండ్రిగ పంచాయతీ, ఎస్టీకాలనీ చెందిన వలంటీర్‌ ఢిల్లీబాబు సహా 12 మంది, పుల్లూరు  ఉప సర్పంచ్‌ లోకేష్‌ రాయల్‌ సహా 12 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. కార్యక్రమంలో మండల తెలుగుయువత ప్రధాన కార్యదర్శి పుల్లూరు బాబు,  ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు వెంకటాచలం, దాము నాయుడు, కుప్పయ్య, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Read more