చిత్తూరులో ఈ పోస్‌ మిషన్లు ప్రారంభం

ABN , First Publish Date - 2022-09-20T05:10:33+05:30 IST

ఆర్టీసీలో చిల్లర సమస్య, నగదురహిత ప్రయాణం కోసం ఈ-పోస్‌ మిషన్లు ప్రవేశ పెట్టారు.

చిత్తూరులో ఈ పోస్‌ మిషన్లు ప్రారంభం

చిత్తూరు రూరల్‌, సెప్టెంబరు 19: ఆర్టీసీలో చిల్లర సమస్య, నగదురహిత ప్రయాణం కోసం ఈ-పోస్‌ మిషన్లు ప్రవేశ పెట్టారు. జిల్లాలో మొదటిసారిగా చిత్తూరు-బెంగుళూరు మధ్య ఈ మిషన్‌ను వాడుకలోకి తెచ్చారుఉ. దీనిని సోమవారం చిత్తూరు డీపీటీవో జితేంద్రనాథ్‌రెడ్డి ప్రారంభించారు. మొదటగా బుకింగ్‌ సర్వీసుల్లో ఈ మిషన్లు వాడనున్నట్లు తెలిపారు. జిల్లాకు ఇప్పటి వరకు 157 మిషన్లు వచ్చాయని, త్వరలో అన్ని సర్వీసుల్లో వీటిని వినియోగిస్తామన్నారు. 

Read more