భారతీయ సంస్కృతికి ఆధ్యాత్మికత మూలం
ABN , First Publish Date - 2022-11-25T23:46:57+05:30 IST
భారతీయ సంస్కృతికి ఆధ్యాత్మికత ప్రధాన మూలమని, నేటి సాంకేతికతకు నాటి వేదాలే ఆధారమని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు అన్నారు.
చిత్తూరు కల్చరల్, నవంబరు 25: భారతీయ సంస్కృతికి ఆధ్యాత్మికత ప్రధాన మూలమని, నేటి సాంకేతికతకు నాటి వేదాలే ఆధారమని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు అన్నారు. చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో శుక్రవారం నారాయణీ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీమద్ శంకరాచార్య విరచిత భజగోవిందం ఆధ్యాత్మిక ప్రసంగం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో నిత్యం జరిగే మంచి చెడులను శంకరాచార్యులు క్లుప్తంగా భజగోవిందం ద్వార విశిద పర్చారన్నారు. కుల మతాలు, భాషా భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భజగోవిందం పఠిస్తే మానవుడు తనలోని రాగద్వేషాలను జయించవచ్చాన్నారు. కేవలం భక్తితో కాలయాపన చేసి విధుల నిర్వహనలో వృథా కాలయాపన చేయడం భక్తి కాదన్నారు. భజగోవిందం అనేది మానవుడు నిత్యం తన కర్తవ్యాన్ని నిర్వహించడానికి ఎంతో దోహద పడుతుందన్నారు. కార్యక్రమానికి నగరంలోని ఆధ్యాత్మిక ప్రచార సంఘాలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం శని, ఆదివారాల్లోనూ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.