-
-
Home » Andhra Pradesh » Chittoor » Spirituality is embedded in the construction of the temple-NGTS-AndhraPradesh
-
ఆలయ నిర్మాణంలో ఆధ్యాత్మికత ఉట్టిపడుతోంది
ABN , First Publish Date - 2022-07-18T06:44:18+05:30 IST
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ పునర్ నిర్మాణ పనులలో ఆధ్యాత్మికత ఉట్టిపడుతోందని రాష్ట్ర దేవాదాయ శాఖ స్తపతి పరమేశ్వరప్ప అన్నారు.

రాష్ట్ర దేవాదాయ శాఖ స్తపతి పరమేశ్వరప్ప
ఐరాల(కాణిపాకం), జూలై 17: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ పునర్ నిర్మాణ పనులలో ఆధ్యాత్మికత ఉట్టిపడుతోందని రాష్ట్ర దేవాదాయ శాఖ స్తపతి పరమేశ్వరప్ప అన్నారు. ఆదివారం కాణిపాకానికి వచ్చిన ఆయన ఆలయ పునర్ నిర్మాణ పనులను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. శిల్పకళ పనులు పురాతన ఆలయాన్ని తలపిస్తున్నాయన్నారు. పనులను త్వరగా పూర్తి చేసి, ఆగస్టు 21న నిర్వహించనున్న మహాకుంభాభిషేకానికి సిద్ధం చేయాలన్నారు. గతంలో ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తే ఇబ్బంది ఉండేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మోహన్‌రెడ్డి, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, కాంట్రాక్టర్ శ్రీధర్‌రెడ్డి, ఏఈ శివాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.