31 స్కూళ్లకు షోకాజ్‌ నోటీసులు

ABN , First Publish Date - 2022-12-07T02:04:47+05:30 IST

జిల్లాలోని వివిధ యాజమాన్యాల పరిధిలో మొబైల్‌ యాప్‌ ద్వారా హాజరు నమోదు చేయని 31 స్కూళ్లకు షోకాజ్‌ నోటీసులు జారీచేసినట్లు డీఈవో డాక్టర్‌ వి.శేఖర్‌ పేర్కొన్నారు.

31 స్కూళ్లకు షోకాజ్‌ నోటీసులు

తిరుపతి(విద్య), డిసెంబరు 6: జిల్లాలోని వివిధ యాజమాన్యాల పరిధిలో మొబైల్‌ యాప్‌ ద్వారా హాజరు నమోదు చేయని 31 స్కూళ్లకు షోకాజ్‌ నోటీసులు జారీచేసినట్లు డీఈవో డాక్టర్‌ వి.శేఖర్‌ పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా యాప్‌లో హాజరు నమోదు చేయాల్సి ఉందన్నారు. దీన్ని ఉన్నతాధికారులు రోజూ పర్యవేక్షిస్తున్నారని, విద్యార్థులు హాజరైనా.. యాప్‌లో హాజరు నమోదు చేయకుంటే గైర్హాజరుగా పరిగణిస్తారని తెలిపారు. పైగా అమ్మఒడి పథకానికి 75శాతం హాజరు నిబంధన ఉందన్నారు. ఇదేవిషయాన్ని 15రోజులుగా చెబుతున్నా.. కొందరు అలసత్వం ప్రదర్శిస్తున్నారన్నారు. సోమవారం 19స్కూళ్లు, మంగళవారం 12స్కూళ్ల చొప్పున మొత్తం 31స్కూళ్లకు సంబంధించి హాజరు నమోదు చేయలేదని, దీనిపై వివరణ కోరుతూ షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని వివరించారు. రెండ్రోజుల్లో సరైన వివరణ ఇవ్వకుంటే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - 2022-12-07T02:04:49+05:30 IST