ఏడుగురు ఎర్ర చందనం స్మగ్లర్ల అరెస్టు

ABN , First Publish Date - 2022-10-08T04:54:25+05:30 IST

ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లును అరెస్టు చేసినట్లు పుంగనూరు రూరల్‌ సీఐ మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఏడుగురు ఎర్ర చందనం స్మగ్లర్ల అరెస్టు
ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చూపుతున్న పుంగనూరు రూరల్‌ సీఐ మధుసూదన్‌రెడ్డి

రూ.12.51లక్షల దుంగల స్వాదీనం


చౌడేపల్లె, సెప్టెంబరు 7: ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లును అరెస్టు చేసినట్లు పుంగనూరు రూరల్‌ సీఐ మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ... చౌడేపల్లె మండలంలోని 29 ఏచింతమాకులపల్లెకు చెందిన  రెడ్డివారి భాస్కర్‌రెడ్డి తన పొలంలో ఎవరో గుర్తు తెలియని దుండగులు 2 ఎర్రచందనం చెట్లను నరికి తీసుకు పోయారని ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు ఎస్‌ఐ రవికుమార్‌  కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.  బైయ్యప్పల్లె వద్ద ఎర్రచందనం దుంగల బెరడు తొలుస్తుండగా తమ సిబ్బందితో దాడులు నిర్వహించి  అదే గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి, శశిధర్‌, నాగభూషణం, గంగాధరం, పుంగనూరు మండలం ఆరడిగుంట పంచాయతీ ఆలజనేరుకు  చెందిన కళ్యాణ్‌కుమార్‌, సోమల మండలం పెద్దఉప్పరపల్లెకు చెందిన నాగరాజ, మధును అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. అలాగే రూ.12.51 లక్షల విలువైన 341 కిలోల 8 దుంగలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కాగా నిందితులపై కేసు నమోదు చేసి రిమాండుకు పంపినట్లు తెలిపారు. కార్యక్రమంలో కానిస్టేబుళ్లు బుడ్డానాయక్‌, ధనశేఖర్‌, రమణ, మునెప్ప, రఫి తదితరులు పాల్గొన్నారు.

Read more