-
-
Home » Andhra Pradesh » Chittoor » Seizure of sand tractors in Narayanapuram forest area-MRGS-AndhraPradesh
-
నారాయణపురం అటవీ ప్రాంతంలో ఇసుక ట్రాక్టర్ల స్వాధీనం
ABN , First Publish Date - 2022-10-12T05:10:44+05:30 IST
రామకుప్పం మండలంలోని నారాయణపురం అటవీ బీట్‌లో ఆదివారం రాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను అటవీ అధి కా రులు స్వాధీనం చేసు కున్నారు.

రామకుప్పం, అక్టోబరు 11: మండలంలోని నారా యణపురం అటవీ బీట్‌లో ఆదివారం రాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను అటవీ అధి కా రులు స్వాధీనం చేసు కున్నారు. బీరన మడుగు వద్ద కొందరు ఇసుక తవ్వ కాలు జరుపుతున్నట్టు అటవీ అధికారులకు సమాచారం అందింది. దీంతో రామకుప్పం అటవీ ఉపక్షేత్రాధికారి వైసీరెడ్డి సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. అటవీ అధికారులు వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న వ్యక్తులు నాలుగు ట్రాక్టర్లను పొదల్లో దాచిపెట్టేశారు. ఇసుక తవ్వకాలు చేపడుతున్న వారిని అధికారులు ప్రశ్నించగా వారు అటవీ అధికారులపై దురుసుగా ప్రవర్తించారు. ఈ విషయం తెలుసుకున్న ఇతర అటవీ సిబ్బంది అక్కడకు చేరుకోవడంతో వారు వెనక్కు తగ్గి ట్రాక్టర్లను వెలికి తీశారు. అటవీ అధికారులు వాటిని ననియాల ఎలిఫెంట్ క్యాంపుకు తరలించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్టర్లకు ఎటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్లు లేకపోవడంతో అవి ఎవరికి చెందినవో తాము విచారణ జరుపుతున్నామన్నారు.