రూ.60వేల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2022-10-07T06:26:02+05:30 IST

చిత్తూరు నుంచి వేలూరుకు గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రూ.60వేల గంజాయి పట్టివేత
నిందితులను, గంజాయిని మీడియాకు చూపిస్తున్న పోలీసులు

చిత్తూరు, అక్టోబరు 6: చిత్తూరు నుంచి వేలూరుకు గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు కేజీల గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు-వేలూరు రోడ్డులోని గోపాలపురం బస్టాప్‌ వద్ద గురువారం  గంజాయిని స్కూటర్‌పై తీసుకెళుతున్న బలరామన్‌నేతాజీ(26)ని అదుపులోకి తీసుకున్నారు. కేజీ గంజాయి, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు తంగవేలు కాలనీకి చెందిన దుర ్గ(37)ను అరెస్టు చేసి, ఆమె నుంచి కేజీ గంజాయి, మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.

Read more