అక్రమంగా తరలుతున్న రేషన్‌ బియ్యం స్వాధీనం

ABN , First Publish Date - 2022-07-06T06:02:30+05:30 IST

బైరెడ్డిపల్లె పట్టణం నుంచి వి.కోట మండలం తోటకనుమ మీదుగా కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా తరలుతున్న రేషన్‌ బియ్యాన్ని తిరుపతి విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అక్రమంగా  తరలుతున్న రేషన్‌ బియ్యం స్వాధీనం

వి.కోట, జూలై 5: బైరెడ్డిపల్లె పట్టణం నుంచి వి.కోట మండలం తోటకనుమ మీదుగా కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా తరలుతున్న రేషన్‌ బియ్యాన్ని తిరుపతి విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలమనేరు - వి.కోట ప్రధాన రహదారి నుంచి కస్తూరినగరం మీదుగా వెళ్తున్న వ్యాన్‌ను ఆపి తనిఖీ చేయగా అందులో బియ్యం బస్తాలు ఉన్నట్టు గుర్తించారు. వాటికి సంబందించి ఏలాంటి బిల్లులు లేకపోవడంతో డ్రైవర్‌ అయాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బైరెడ్డిపల్లె పరిసరాల్లో రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేసి కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అంగీకరించాడు. దీంతో బియ్యం అక్రమ రవాణాగా విజిలెన్స్‌ ఎస్‌ఐ రామస్వామి  కేసు నమోదు చేశారు. అలాగే 3 టన్నులు రేషన్‌ బియ్యాన్ని సీజ్‌ చేసి వి.కోట  తహసీల్దార్‌కు అప్పగించారు. బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని, డ్రైవర్‌ అయాజ్‌ను పోలీసులకు అప్పగించారు. విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ   సుమారు రూ. 50 వేలు ఉంటుందని తెలిపారు. 

Updated Date - 2022-07-06T06:02:30+05:30 IST