నేడు పాఠశాలలు పునఃప్రారంభం
ABN , First Publish Date - 2022-10-07T06:51:37+05:30 IST
దసరా సందర్భంగా గత నెల 26 నుంచి పాఠశాలలకు ప్రకటించిన సెలవులు గురువారంతో ముగిశాయి.
చిత్తూరు (సెంట్రల్), అక్టోబరు 6: దసరా సందర్భంగా గత నెల 26 నుంచి పాఠశాలలకు ప్రకటించిన సెలవులు గురువారంతో ముగిశాయి. దీంతో శుక్రవారం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఒక్కరోజు పనిదినం అనంతరం 8న రెండో శనివారం, 9న ఆదివారం సెలవులు రానున్నాయి. అయితే శుక్రవారం ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయుడు విధిగా విధులకు హాజరుకావాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.