ఉపగ్రహ తయారీలో నిమగ్నమైన బాలికలు
ABN , First Publish Date - 2022-08-04T06:43:14+05:30 IST
ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి థీమ్ అంతరిక్షంలో మహిళలు. దానికి అనుగుణంగా చెన్నైకి చెందిన స్పేస్‌కిడ్జ్ ఇండియా మనదేశ బాలికలతో ఆజాదీశాట్ అనే ఉపగ్రహాన్నే తయారు చేయించింది.
బుల్లి రాకెట్లో చిన్నారి శాస్త్రవేత్తల శాటిలైట్
750 మంది బాలికలు తయారు చేసిన
ఆజాదీశాట్.. 7న నింగిలోకి
ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి థీమ్ అంతరిక్షంలో మహిళలు. దానికి అనుగుణంగా చెన్నైకి చెందిన స్పేస్‌కిడ్జ్ ఇండియా మనదేశ బాలికలతో ఆజాదీశాట్ అనే ఉపగ్రహాన్నే తయారు చేయించింది. దేశవ్యాప్తంగా 75 పాఠశాలల్లో 8 నుంచి 12వ తరగతి వరకు చదివే 750 మంది విద్యార్థినులను ఎంపిక చేసింది. వారికి ఉపగ్రహాన్ని తయారుచేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించింది. మనదేశానికి చెందిన హెక్టావేర్ టెక్నాలజీ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద రూ.58 లక్షలు ఈ బృహత్కార్యానికి సమకూర్చింది. ఈ నెల 7న ఇస్రో ప్రయోగించనున్న ఎస్‌ఎ్‌సఎల్వీ రాకెట్లో ఈ ఆజాదీశాట్‌ను కక్ష్యలోకి చేరవేయనున్నారు.
తెలుగు బాలికల పాత్ర..
ఉభయ తెలుగురాష్ట్రాలకు చెందిన 8 పాఠశాలల విద్యార్థులు ఈ ఉపగ్రహ తయారీలో పాల్గొన్నారు. ఏపీలోని తిరుపతి జిల్లా నారాయణవనం జడ్పీ బాలికోన్నత పాఠశాల, తూర్పుగోదావరి జిల్లా వీరలంకపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులం, అనంతపురం జిల్లాలోని కురుగుండ ఏపీఎస్‌డబ్ల్యూఆర్ స్కూల్ విద్యార్థులు ఇంఉదలో భాగస్వాములయ్యారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఆర్మూరులోని జడ్పీహెచ్‌ఎ్‌స బాలికోన్నత పాఠశాల, సికింద్రాబాద్‌లోని ఎస్టీ ఫ్రాన్సిస్ బాలికోన్నత పాఠశాల, వరంగల్ జిల్లా గుర్జకుంటలోని జడ్పీహెచ్‌ఎ్‌స ఎండి చెరియల్ స్కూల్, ఖమ్మం జిల్లా ఎర్రుపాళెంలోని టీఎ్సడబ్ల్యూఆర్ఎ్స-జూనియర్ కాలేజీ, హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎ్‌స స్కూల్ విద్యార్థులు ఇందులో పాలుపంచుకున్నారు. బాలికలే రూపొందించిన ఈ ఆజాదీశాట్ బరువు 8 కిలోలు. ఈ శాటిలైట్ రోదసిలో సంచరిస్తూ వాతావరణ సమాచారాన్ని రేడియో ధార్మికతతో పాటు ఫొటోలు తీసి పంపిస్తుంది.