జెండా వందనం

ABN , First Publish Date - 2022-08-16T07:00:34+05:30 IST

చిత్తూరులోని పలు ప్రభుత్వ శాఖల్లో సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాలను ఎగురవేసి.. వందనం చేశారు.

జెండా వందనం
కలెక్టర్‌ బంగ్లాలో పతాకావిష్కరణ చేస్తున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 15: చిత్తూరులోని పలు ప్రభుత్వ శాఖల్లో సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాలను ఎగురవేసి.. వందనం చేశారు. కలెక్టర్‌ బంగ్లాలో కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. కలెక్టరేట్‌లో జేసీ వెంకటేశ్వర్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు. అంతకుముందు ఆయన మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డీఆర్వో రాజశేఖర్‌, ఏవో కులశేఖర్‌ పాల్గొన్నారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆవరణలో బ్యాంకు చైర్‌పర్సన్‌ ఎం.రెడ్డెమ్మ జాతీయ పతాకాన్ని ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపారు. సీఈవో మనోహర్‌ గౌడ్‌, డైరెక్టర్లు కరుణాకర్‌ చౌదరి, బాలసుబ్రహ్మణ్యం, హరినాథ్‌ రెడ్డి, జీఎం లిల్లీ కేథరిన్‌ పాల్గొన్నారు. జిల్లా కో-ఆపరేటివ్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌ ఆవరణలో చైర్మన్‌ జి.మురళీమోహన్‌ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యదర్శి కె.మురళి, సిబ్బంది పాల్గొన్నారు.


Read more