కాణిపాకంలో కొనసాగుతున్న రద్దీ
ABN , First Publish Date - 2022-05-23T05:27:56+05:30 IST
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

ఐరాల(కాణిపాకం), మే 22: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం నుంచి స్వామి దర్శనార్థం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. క్యూలు పూర్తిగా నిండిపోయాయి. స్వామి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. క్యూలలో తొక్కిసలాట చోటుచేసుకోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. భక్తులకు మంచినీరు, మజ్జిగ పంపిణీ చేశారు.