గుండెపోటుతో ఆర్‌ఐ హఠాన్మరణం

ABN , First Publish Date - 2022-07-01T05:28:59+05:30 IST

నాగలాపురం ఆర్‌ఐ ఉషారాణి గురువారం గుండెపోటుతో మృతి చెందారు.

గుండెపోటుతో ఆర్‌ఐ హఠాన్మరణం

నాగలాపురం: నాగలాపురం ఆర్‌ఐ ఉషారాణి గురువారం గుండెపోటుతో మృతి చెందారు. రెవెన్యూ సిబ్బంది కథనం మేరకు.. పుత్తూరుకు చెందిన ఉషారాణి నాగలాపురం ఆర్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు.  ఉదయం యథావిధిగా కార్యాలయానికి విధులకు వచ్చారు. మధ్యాహ్నం రెండు గంటలకు మండలంలోని బీకేబేడు సచివాలయం తనిఖీకి తహసీల్దార్‌ ప్రసన్నకుమార్‌తో కలిసి వచ్చారు. ఈ క్రమంలో సచివాలయంలో ఉషారాణి అస్వ స్థతకు గురయ్యారు. తహసీల్దార్‌ వెంటనే తన కారులో నాగలాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స  అనంతరం మెరుగైన చికిత్స కోసం పుత్తూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె మృతిచెందారు. ఉషా రాణి మృతికి రెవెన్యూ సిబ్బంది, పలువురు ప్రజా ప్రతినిధులు సంతాపం తెలిపారు.

Updated Date - 2022-07-01T05:28:59+05:30 IST