ఆర్డీవో కార్యాలయ ఏర్పాట్లలో తలమునకలైన రెవెన్యూ అధికారులు
ABN , First Publish Date - 2022-04-04T06:25:19+05:30 IST
పలమనేరులో ఈ నెల 4వతేది ప్రారంభం కానున్న నూతన రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఏర్పాట్లలో పలమనేరు రెవెన్యూ అధికారులు, సిబ్బంది తలములకలయ్యారు.
పలమనేరు, మార్చి 3: పలమనేరులో ఈ నెల 4వతేది ప్రారంభం కానున్న నూతన రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఏర్పాట్లలో పలమనేరు రెవెన్యూ అధికారులు, సిబ్బంది తలములకలయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 4న కొత్త జిల్లాలు, రెవిన్యూ డివిజన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఇక్కడి రెవెన్యూ అధికారులు ఆఘమేఘాల మీద రెవెన్యూ డివిజన్ కార్యాలయం కోసం సీఎల్‌ఆర్సీ భవనాన్ని ఎంపిక చేశారు. 2008లో ఈ భవనాన్ని జిల్లా గ్రామీణాభివృద్దిశాఖ, జిల్లా నీటియాజమాన్య సంస్థ జీవనోపాధుల వనరుల కేంద్రం(సీఎల్‌ఆర్సీ)గా నిర్మించగా 2009లో వైద్యవిద్య, ఆరోగ్యబీమా శాఖ మంత్రి గల్లాఅరుణకుమారి ప్రారంభించారు. అయితే అప్పటినుంచి ఈ భవనానికి తగిన నిర్వహణ లేక భవనం నిరాదరణకు గురైంది. ఈ భవనం కింది భాగాన రెండు వైపులా మూడుగదుల చొప్పున ఉండగా, భవనం మొదటి అంతస్తులో రెండు వైపులా సువిశాలంగా రెండు సమావేశ మందిరాలున్నాయి. ప్రస్తుతానికి ఆర్డీవో కార్యాలయానికి ఈ భవనం ఏంతో అనూకూలమైందనే చెప్పవచ్చు. ఈనెల 4న ఈ భవనంలో కొత్త ఆర్డీవో కార్యాలయం ప్రారంభం కావాల్సి ఉండగా ఆదివారం సెలవురోజు అయినప్పటికీ తహసీల్దార్ కుప్పస్వామి, రెవెన్యూ అధికారులు దగ్గరుండి మరీ కూలీల వద్ద చేయిస్తున్నారు. ఇక ప్రారంభోత్సవ సందర్భంగా కార్యాలయంలోని వివిధ గదులకు అలంకరణ కోసం ఇక్కడి వీఆర్‌ఏలు ఆదివారం సాయంత్రం వరకు కూడా పూలు కట్టే పనిలో నిమగ్నమయ్యారు. కార్యాలయం లోపలి వైపు పెయింటింగ్ పనులు కొంతమేర పూర్తయినప్పటికీ కార్యాలయం వెలుపల, కిటికీలు పెయింటింగ్ పనులు మాత్రం మరో వారం రోజుల్లో పూర్తికావచ్చని భావిస్తున్నారు.
కడాతో