రీసర్వే వేగవంతం చేయాలి - జేసీ

ABN , First Publish Date - 2022-07-05T05:47:04+05:30 IST

జగనన్న భూహక్కు, భూరక్ష రీసర్వే పనులు వేగవంతం చేయాలని జేసీ బాలాజి అధికారులను ఆదేశించారు.

రీసర్వే వేగవంతం చేయాలి - జేసీ

తిరుపతి(కొర్లగుంట), జూలై 4: జగనన్న భూహక్కు, భూరక్ష రీసర్వే పనులు వేగవంతం చేయాలని జేసీ బాలాజి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రెవెన్యూ అంశాల పరిష్కారం, రీసర్వే, గోడౌన్ల నిర్మాణాలు, స్పందనపై రెవెన్యూ డివిజన్‌ అధికారులు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ప్యూరిఫికేషన్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ వేగవంతం చేయాలని, ప్రీడ్రోన్‌ సర్వే సమయంలో ప్రభుత్వ భూములను, డీకేటీలను పరిశీలించాలన్నారు. తొలి విడతలో మంజూరైన 30గోదాములు నిర్మాణాలు జరుగుతున్నాయని, రెండోదశలో 29కి గాను 12కి స్థలాలు గుర్తించలేదని వాటిపై దృష్టి పెట్టాలన్నారు. ఓటీఎస్‌ దరఖాస్తులు పెండింగ్‌ లేకుండా రిజిస్ర్టేషన్‌ కాపీలను అందించాలన్నారు. కౌలు రైతులకు ఇచ్చే సీసీఆర్‌సీ కార్డులను అర్హులకు త్వరగా అందజేయాలన్నారు. వివిధ విభాగాల అధికారులు జయరాజ్‌, ఉమాదేవి, దొరసాని, కనకనరసారెడ్డి, మురళీకృష్ణ, రోస్‌మాండ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more