గజ బాధితులకు నష్ట పరిహారం విడుదల చేయండి
ABN , First Publish Date - 2022-03-05T06:21:00+05:30 IST
జిల్లాలో గజ బాధితులకు నష్టపరిహారాన్ని అందించాలని కేంద్ర బృందం సభ్యు లను జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు కోరారు. శుక్రవారం పలమనేరుకు వచ్చిన కేంద్రబృందంతో కలిసి ఆయన పర్యటించారు.
పలమనేరు, మార్చి 4: జిల్లాలో గజ బాధితులకు నష్టపరిహారాన్ని అందించాలని కేంద్ర బృందం సభ్యు లను జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు కోరారు. శుక్రవారం పలమనేరుకు వచ్చిన కేంద్రబృందంతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ... సోలార్ విద్యుత్ కంచె నిర్మాణానికి రూ.28.5 కోట్లను విడుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా కేంద్రబృందం పలమనేరు సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు, వన్యప్రాణులు జాతీయ రహదారి మీదుగా ఒకవైపు నుంచి మరో వైపుకు వెళ్తూ ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అటవీ అధికారులతో చర్చించింది. పలమ నేరు - చిత్తూరు రహదారిలో పలమనేరు సమీపం లోని ఆంజనేయ స్వామిగుడి, గాంధీనగర్, జగమర్ల, దొరచెరువు తదితర ప్రాంతాల్లో అండర్ బ్రిడ్జీలు, ఫ్లై ఓవర్ల నిర్మాణానికి గల అవకాశాలను పరిశీలించారు. జిల్లాలో దాదాపు 31 మండలాల్లో వందలాది మంది రైతులు ఏనుగుల దాడులతో ఇబ్బంది పడుతున్నారని జడ్పీ చైరన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర బృంద సభ్యులు మన్‌మోహన్, డీఎఫ్‌ఓ రవిశంకర్, ఎన్‌హెచ్ పీడీ ప్రశాంత్, చిత్తూరు, కుప్పం, పలమనేరు అటవీ శాఖ రేంజర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.