ఆహార పరిశ్రమలకు రాయలసీమ అనువైన ప్రదేశం

ABN , First Publish Date - 2022-11-12T00:21:25+05:30 IST

ఆహార సంబంధిత పరిశ్రమలకు రాయలసీమ జిల్లాల్లో అనువైన వాతావరణం ఉందని రాష్ట్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కార్యదర్శి చిరంజీవి చౌదరి పేర్కొన్నారు.

ఆహార పరిశ్రమలకు రాయలసీమ అనువైన ప్రదేశం
చిరంజీవి చౌదరికి స్వాగతం పలుకుతున్న కలెక్టర్‌

చిత్తూరు (సెంట్రల్‌), నవంబరు 12: ఆహార సంబంధిత పరిశ్రమలకు రాయలసీమ జిల్లాల్లో అనువైన వాతావరణం ఉందని రాష్ట్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కార్యదర్శి చిరంజీవి చౌదరి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లాకు వచ్చిన ఆయన్ను కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో కలిశారు. చిరంజీవి చౌదరి మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తే అన్ని విధాలా సహకరిస్తామన్నారు. మధ్యవర్తులు లేకుండా ఆహార ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో కుటీర పరిశ్రమల ఏర్పాటుకు 857 దరఖాస్తులు రాగా 47 మందికి రుణాలు మంజూరు చేసినట్లు చెప్పారు. ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ కార్యదర్శి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యానవన పంటల సాగుతో రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా రూపొందించామన్నారు. డీఆర్‌డీఏ పీడీ తులసి మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మరింత అవగాహన కల్పించి చైతన్య పరస్తున్నట్లు తెలిపారు. రాయలసీమ జిల్లాల అధికారులతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-12T00:21:30+05:30 IST