రామకుప్పం ఎస్‌ఐ రివాల్వర్‌ చిక్కింది

ABN , First Publish Date - 2022-05-15T07:26:13+05:30 IST

ఎట్టకేలకు రామకుప్పం ఎస్‌ఐ వెంకటశివకుమార్‌ సర్వీస్‌ రివాల్వర్‌, బుల్లెట్లు దొరికాయి.

రామకుప్పం ఎస్‌ఐ రివాల్వర్‌ చిక్కింది
దొరికిన రివాల్వర్‌, బుల్లెట్లు

రామకుప్పం, మే 14: ఎట్టకేలకు రామకుప్పం ఎస్‌ఐ వెంకటశివకుమార్‌ సర్వీస్‌ రివాల్వర్‌, బుల్లెట్లు దొరికాయి. కుప్పం రూరల్‌ సీఐ సూర్యమోహనరావు కథనం మేరకు... గత ఫిబ్రవరి 13న ఎస్‌ఐ సర్వీస్‌ రివాల్వర్‌ బుల్లెట్లను సర్వీసింగ్‌ కోసం చిత్తూరుకు పంపారు. సర్వీసింగ్‌ నుంచి వచ్చిన రివాల్వర్‌, బుల్లెట్లను లాకర్‌రూంలో భద్రపరిచారు. ఈ నెల 10న తిరిగి రివాల్వర్‌ను సర్వీసింగ్‌కు పంపేందుకు లాకర్‌ రూం బీరువాను తెరచి చూడగా రివాల్వర్‌, బుల్లెట్లున్న  పౌచ్‌ కన్పించకుండా పోయింది. దీంతో పలమనేరు డీఎస్పీ గంగయ్య, సీఐ సూర్యమోహనరావు సమాచారం తెలుసుకుని, రామకుప్పానికి వచ్చి ఎస్‌ఐ, సిబ్బందిని విచారించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 10 రోజుల్లో రివాల్వర్‌, బుల్లెట్ల ఆచూకీ కనుగొనాలని ఎస్‌ఐ, సిబ్బందికి గడువిచ్చారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ ఆదేశాల మేరకు సీఐ సమక్షంలో ఎస్‌ఐ, సిబ్బంది శనివారం మరోసారి స్టేషను మొత్తం వెదికారు. ఈ ప్రయత్నంలో లాకర్‌రూంలోని బీరువా కింద రివాల్వర్‌, బుల్లెట్లున్న  పౌచ్‌ను గుర్తించారు. దీంతో ఎస్‌ఐ, సిబ్బంది ఊపిరి  పీల్చుకున్నారు.

Updated Date - 2022-05-15T07:26:13+05:30 IST