రాజనాలబండ పేరు చెప్పగానే నేరం అంగీకరించాడు
ABN , First Publish Date - 2022-01-09T04:46:16+05:30 IST
సత్యప్రమాణాలకు నిలయమైన రాజనాలబండ పేరు చెప్పగానే చేసిన తప్పును ఒప్పుకున్న సంఘటన చౌడేపల్లె మండలంలో శనివారం వెలుగుచూసింది.
చౌడేపల్లె, జనవరి8: సత్యప్రమాణాలకు నిలయమైన రాజనాలబండ పేరు చెప్పగానే చేసిన తప్పును ఒప్పుకున్న సంఘటన చౌడేపల్లె మండలంలో శనివారం వెలుగుచూసింది. బాధితుల కథనం మేరకు.. గంగవరం మండలం పత్తికొండ పంచాయతీ కోటగురువేపల్లెకు చెందిన పాపిరెడ్డి రైతు. ఇతడు తన ఇంటి వద్ద నాటుకోళ్లు పెంచుకునేవాడు. ఈ క్రమంలో ఆయన కోళ్లకు గుర్తుతెలియని వ్యక్తులు గత డిసెంబరు 27న మత్తుమందు పెట్టారు. అది తిన్న రూ.75వేలు విలువైన కోళ్లు మృతిచెందాయి. గ్రామ పెద్దల సలహా మేరకు రాజనాలబండలో సత్యప్రమాణం కోసం గ్రామస్తులను ఆహ్వానించాడు. ఈ క్రమంలో నిందితుడు తన తప్పును ఒప్పుకుని రూ.10వేలు పరిహారం చెల్లించాడు. ఆ మేరకు బాధితులు నష్టపరిహారంగా నిందితుడు చెల్లించిన సొమ్మును స్వామివారి వద్ద ఉంచి పూజలు చేయించారు.