25 మండలాల్లో వర్షం.. ఐరాలలో అత్యధికం
ABN , First Publish Date - 2022-10-07T06:16:04+05:30 IST
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా రెండు రోజులు ముసుగేసింది.
చిత్తూరు కలెక్టరేట్, అక్టోబరు 6: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా రెండు రోజులు ముసుగేసింది. బుధవారం ఉదయం 8 నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 25 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా ఐరాలలో 66.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా జీడీ నెల్లూరులో 46.8,రొంపిచెర్లలో 43.6, చిత్తూరులో 40, పులిచెర్లలో 39, పలమనేరులో 38, పెనుమూరులో 30, సోమలలో 28.6, గంగవ రంలో 28.6, పూతలపట్టులో 28, యాదమరిలో 26.8, వెదురుకుప్పంలో 25.4, ఎస్ఆర్పురంలో 24.8, సదుంలో 22.2,. పాలసముద్రంలో 20.2, నిండ్రలో 18.2, పుంగనూరులో 18, చౌడేపల్లెలో 17.8, తవణంపల్లెలో 16.4, గుడిపాలలో 10.6, నగరిలో 10.4, విజయపురంలో 10.2, కార్వేటినగరంలో 10, బంగారుపాళ్యంలో 8.4, పెద్ద పంజాణిలో 5.2 మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది.