సంస్కృత వర్సిటీ ఇన్చార్జి వీసీగా రాధాకాంత్
ABN , First Publish Date - 2022-01-17T07:07:04+05:30 IST
తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీ ఇన్చార్జి వీసీగా జ్యోతిష్య విభాగం ప్రొఫెసర్ రాధాకాంత్ఠాకూర్ నియమితులయ్యారు.

తిరుపతి(విద్య), జనవరి 16: తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీ ఇన్చార్జి వీసీగా జ్యోతిష్య విభాగం ప్రొఫెసర్ రాధాకాంత్ఠాకూర్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు వీసీగా పనిచేసిన మురళీధర్శర్మ ఈనెల 13న మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్చార్జి వీసీని నియమించారు. శనివారం రాధాకాంత్ బాధ్యతలు చేపట్టారు. ఈసందర్భంగా ఆయన్ను పలువురు అభినందించారు.