-
-
Home » Andhra Pradesh » Chittoor » principal died in accident-NGTS-AndhraPradesh
-
రోడ్డు ప్రమాదంలో ప్రిన్సిపాల్ దుర్మరణం
ABN , First Publish Date - 2022-03-05T05:57:26+05:30 IST
పీలేరులోని శ్రీమేధ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బాలకృష్ణ భాకరాపేట ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.

పీలేరు/చంద్రగిరి, మార్చి 4: పీలేరులోని శ్రీమేధ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బాలకృష్ణ భాకరాపేట ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. తిరుపతిలో ఇంజనీరింగ్ చదువుతున్న తన కుమారుడు కిశోర్ ఫీజు విషయమై కళాశాలలో మాట్లాడేందుకు తిరుపతికి వెళ్లిన ఆయన తిరుగు ప్రయాణంలో కళాశాల అధ్యాపకుడు రాధాకృష్ణతో కలిసి ద్విచక్రవాహనంలో వస్తుండగా భాకరాపేట ఘాట్‌లో ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు ఆయనను రుయాస్పత్రికి తరలించగా కొద్దిసేపటికే మృతి చెందారు. మృతదేహాన్ని తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.బాలకృష్ణకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.