సచివాలయ సిబ్బందిపై ఒత్తిళ్లు మానుకోవాలి

ABN , First Publish Date - 2022-10-18T05:12:33+05:30 IST

తమపై ఒత్తిళ్ళు మానుకోవాలని గ్రామసచివాల ఉద్యోగుల ఫెడరేషన్‌ జిల్లా నేత యువరాజు, కుప్పం ఎన్జీవో సంయుక్త కార్యదర్శి ఆనంద్‌ కోరారు

సచివాలయ సిబ్బందిపై ఒత్తిళ్లు మానుకోవాలి
రామకుప్పంలో సుభాష్‌వర్మకు నివాళులర్పిస్తున్న గ్రామసచివాలయ సిబ్బంది

రామకుప్పం, అక్టోబరు 17:  తమపై ఒత్తిళ్ళు మానుకోవాలని గ్రామసచివాల ఉద్యోగుల ఫెడరేషన్‌ జిల్లా నేత యువరాజు, కుప్పం ఎన్జీవో  సంయుక్త కార్యదర్శి ఆనంద్‌ కోరారు. తూర్పుగోదావరి జిల్లాలో బలవన్మరణం చేసుకున్న గ్రామ ఉద్యాన సహాయకుడు సుభాష్‌వర్మకు సోమవారం రామకుప్పం మండల సచివాలయంలో సిబ్బంది నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సుభాష్‌వర్మ ఉన్నతాధికారుల ఒత్తిళ్ళు, వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. సుభాష్‌వర్మ మృతి బాధాకరమని, ప్రభుత్వం అతని కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, అదేవిధంగా కారుణ్యనియామకం కింద అతని కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. గ్రామసచివాలయ ఉద్యోగులు ఉన్నతాధికారుల ఒత్తిళ్ళతో ధీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే వారికి హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ ఫెడరేషన్‌ మండల అధ్యక్షుడు బాబురెడ్డి, మధురవాణి, మౌనిక, పరమేష్‌, వేంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-18T05:12:33+05:30 IST