వైభవంగా ప్రదోష పూజలు

ABN , First Publish Date - 2022-10-08T05:11:15+05:30 IST

నాగలాపురం మండల పరిధిలోని సురుటుపల్లి పల్లికొండేశ్వరాల యంలో శుక్రవారం ప్రదోష పూజలు వైభవంగా నిర్వహించారు.

వైభవంగా ప్రదోష పూజలు
ఆలయ ప్రాకారోత్సవంలో నందీశ్వరుడు

నాగలాపురం, అక్టోబరు 7: నాగలాపురం మండల పరిధిలోని సురుటుపల్లి పల్లికొండేశ్వరాల యంలో శుక్రవారం ప్రదోష పూజలు వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు ఆలయంలోని పరివార దేవతలకు అభిషేకాలు చేసి విశేష పూజలు చేశారు. సాయంత్రం ఆలయ ప్రదోష మండపంలోని నందీశ్వరుడికి పంచామృతాలతో అభిషేకాలు చేసి దీప ధూప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం నందీశ్వరుడిని వివిధ పుష్పాలతో పుష్పాలంకరించి మహా హరతి, నక్షత్ర హారతి, కుంభ హారతులు చేపట్టారు. ఈ పూజలను ఆలయ ఈవో రామచంద్రారెడ్డి, ఛైర్మన్‌ ఏ.వి.ఎం మునిశేఖర్‌రెడ్డి పర్యవేక్షించారు. 

Read more