కక్షసాధింపు చర్యలు మానుకోవాలి
ABN , First Publish Date - 2022-10-18T05:26:14+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్‌శాఖ ఇంజనీర్లపై కక్షసాధింపు చర్యలు మానుకోవాలని పీఆర్‌ఇంజనీర్ల జేఏసీ చైర్మన్ శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ డిప్లామో ఇంజనీర్ల సంఘం గౌరవాధ్యక్షుడు రియాజ్‌ఆహ్మద్ అన్నారు.
గూడూరు, అక్టోబరు 17: రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్‌శాఖ ఇంజనీర్లపై కక్షసాధింపు చర్యలు మానుకోవాలని పీఆర్‌ఇంజనీర్ల జేఏసీ చైర్మన్ శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ డిప్లామో ఇంజనీర్ల సంఘం గౌరవాధ్యక్షుడు రియాజ్‌ఆహ్మద్ అన్నారు. సోమవారం స్థానిక పంచాయతీరాజ్ కార్యాలయంలో భోజన విరామ సమయంలో పీఆర్‌ఇంజనీర్ల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్‌శాఖ ద్వారా చేపట్టిన గ్రామసచివాయాలు, డిజిటల్ లైబ్రరీ ఇతర భవనాల నిర్మాణాల పనులకు సంబంధించిన బిల్లు ప్రభుత్వం సక్రమంగా చెల్లించకపోగా తమ శాఖ ఇంజనీర్లను బాఽధ్యులుగా చేస్తూ సస్పెండ్ చేయడం విచారకరమన్నారు. 2018 సంవత్సరంలో జరిగిన ఉపాధిహామీ పథకంలోని సీసీ రోడ్లు పనులపై విజిలెన్స్ తనిఖీలకు ఆదేశించడం హేయమైన చర్య అన్నారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే ఈనెల 24వ తేదీ నుంచి సహాయనిరాకరణ చేపడుతామన్నారు. కార్యక్రమంలో దయాకర్, రవీంద్రకుమార్, కృష్ణబాబు, రామచంద్రయ్య, మునికుమార్, పద్మావతి, చంద్రశేఖర్, కిరణ్, ఇలియాజ్, రామయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.